ETV Bharat / state

సుప్రీంకోర్టు 'బుల్డోజర్ న్యాయం ఆపండి​' ఆదేశాలు 'హైడ్రా'కు వర్తించవ్ : రంగనాథ్ - HYDRA Ranganath on SC Verdict - HYDRA RANGANATH ON SC VERDICT

HYDRA Commissioner Ranganath Reaction : బుల్డోజర్​ న్యాయం ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తమకు వర్తించవని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్​లాంటి రాష్ట్రాల్లోని నేరస్తులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు.

HYDRA Commissioner Ranganath Reaction
HYDRA Commissioner Ranganath Reaction (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 6:53 PM IST

HYDRA Commissioner Ranganath Clarity on Supreme Court Verdict : బుల్డోజర్​ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ స్పందించారు. ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తరప్రదేశ్​లాంటి రాష్ట్రాల్లోని నేరస్తులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయని అన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. అలాగే నేరస్తులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్​ పేర్కొన్నారు.

బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్​ గుర్తు చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారన్నారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తుందని, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో స్పందించిన రంగనాథ్​ ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని ముందస్తుగానే స్పష్టం చేయడం గమనార్హం.

హైడ్రా కూల్చివేతలు : హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో నిర్మాణదారులు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేస్తున్నారు. తమ నిర్మాణాలు ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో లేవని తెలుపుతూ హైకోర్టులో పిటిషన్​లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్​ సుప్రీంకోర్టు తీర్పును తెలిపిన నేపథ్యంలో హైడ్రా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సమాచారం. ఇప్పటివరకు హైడ్రా 262 నిర్మాణాలను పడగొట్టి, సుమారు 110 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.

బుల్డోజర్​ న్యాయంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం : ముందస్తు అనుమతులు లేకుండా బుల్డోజర్​ చర్యలు వద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లో అనధికారికంగా జరిపే ఇటువంటి బుల్డోజర్​ చర్యలను అక్టోబరు 1వ తేదీ వరకు నిలిపివేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వచ్చే విచారణ తేదీ వరకు మీ చర్యలను ఆపమని మేం కోరినంత మాత్రాన కొంపలేం మునిగిపోవని జస్టిస్​ బి.ఆర్​.గవాయ్, కె.వి.విశ్వనాథన్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆక్రమణల తొలగింపు ఆలస్యమవుతున్న ప్రభుత్వ భయాలను న్యాయస్థానం కొట్టిపారేసింది.

వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న బుల్డోజర్​ చర్యలపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అనుమతులు లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. దీనిపై ఎన్నికల కమిషన్​కు కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. ఫుట్​పాత్​, రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రైల్వే లైన్లు, జలవనరుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవచ్చని వెల్లడించింది.

'ఇప్పటివరకు 262 అక్రమ నిర్మాణాల కూల్చివేత' - ప్రభుత్వానికి హైడ్రా లేటెస్ట్ రిపోర్టు - HYDRA DEMOLITIONS REPORT LATEST

అధికారుల్లో 'హైడ్రా' వణుకు - ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు అప్పీల్​ - Hydra Case Filed On Govt Officials

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.