LIVE : చెన్నైలో 'దేవర' మూవీ టీమ్ ప్రెస్‌మీట్ - ప్రత్యక్షప్రసారం - Devara Movie Team Press meet Live - DEVARA MOVIE TEAM PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 7:32 PM IST
|Updated : Sep 17, 2024, 8:07 PM IST
Devara Movie Team Press Meet in Chennai Live : పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. సెప్టెంబరు 27న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో తారక్ లుక్, యాక్షన్, డైలాగ్స్ అన్నీ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూవీటీమ్ మరో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.అయితే ఈ సారి విడుదల చేయనున్న ట్రైలర్ కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కే కాదు అందరికీ నచ్చేలా మరింత పవర్ ఫుల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో జరగనున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ రెండో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర బృందం చెన్నైలో సందడి చేస్తొంది. ఈ సందర్భంగా చెన్నై నుంచి ప్రత్యక్షప్రసారం.
Last Updated : Sep 17, 2024, 8:07 PM IST