Nasa On Starliner Return Date : బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరిన్ని నెలలు ఉండనుంది. స్టార్‌లైనర్‌లో ఉన్న భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మరిన్ని రోజులు పరీక్షలు చేయనున్నారు. నాసా ఇంజినీర్లు స్టార్‌లైనర్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించారు. అయితే, అంతరిక్ష కేంద్రంలో పరీక్షలు పూర్తయ్యే వరకు భూమిపైకి తిరిగి వచ్చే తేదీని నిర్ణయంచలేమని నాసా కమర్షియల్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ పేర్కొన్నారు. వ్యోమగాములు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45-90 రోజులకు పొడిగించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో తర్వలోనే భూమికి చేరుకుంటుందనుకున్న స్టార్‌లైనర్ వ్యోమనౌక, మరిన్ని నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనుంది. కాగా, ఈ ఏడాది జూన్ 5న ఈ అంతరిక్ష యాత్రను చేపట్టారు.
మరిన్ని నెలలు అంతరిక్ష కేంద్రంలోనే సునీత- వ్యోమగాములు ఇద్దరూ సేఫ్!
Published : Jun 29, 2024, 11:03 AM IST