ETV Bharat / snippets

గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడి - 24 మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Israel Airstrike On Gaza
Israel Airstrike On Gaza (ETV Bharat)

Israel Airstrike On Gaza : హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గాజా పట్టీలోని ఓ పాఠశాల, ప్రార్థనా స్థలంలో ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 24 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 93 మంది గాయపడినట్టు పేర్కొన్నాయి. డీర్‌-అల్‌-బలాహ్‌లోని అల్‌ అక్సా ఆస్పత్రికి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపాయి. వివిధ ప్రాంతాల నుంచి గాజా స్ట్రిప్‌లోకి వచ్చి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న వారే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిందని అధికారులు ఆరోపించారు. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలకు సోమవారంతో ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. గాజా పట్టీలోని రష్ద్‌ పాఠశాల, షుహాదా-అల్‌ అక్సా ప్రార్థనాస్థలంలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.