ETV Bharat / snippets

నేను గెలిస్తే వాళ్లు జైలుకే- అలాంటి వారిని వదిలిపెట్టను! : డొనాల్డ్ ట్రంప్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 7:31 PM IST

Donald Trump
Donald Trump (ANI)

Donald Trump Warning : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక హెచ్చరికలు చేశారు. అవినీతి, ఎన్నికల్లో అక్రమాల అంశాలను మరోసారి ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను అధికారం చేపట్టగానే అలాంటి వారందరిని జైలుకు పంపిస్తానన్నారు. న్యాయవాదులు, రాజకీయనాయకులు, దాతలు, అక్రమ ఓటర్లు, అధికారులు అందరికీ వర్తిస్తుందని ట్రంప్‌ అన్నారు. ఓటింగ్‌లో అవినీతికి పాల్పడినట్లు తేలితే మునుపెన్నడూ లేనివిధంగా దీర్ఘకాల జైలుశిక్షలు ఉంటాయన్నారు. తద్వారా న్యాయం దుర్వినియోగం మళ్లీ జరగదని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్‌, అందుకు అక్రమాలే కారణమని ఆరోపించారు. ఆ విషయాన్ని ఆయన రుజువు చేయలేకపోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.