Bridge Collapse In China : చైనాలో వంతెన కూలి 11 మంది మరణించగా, మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం షాంగ్సీ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు కారణంగా వంతెన పాక్షికంగా కూలిపోయిందని చెప్పారు. ఇప్పటి వరకు నదిలో పడిపోయిన ఐదు వాహనాలను బయటకు తీసినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం 76 వాహనాలు, 18 బోట్లు, 32 డ్రోన్లు సహా 736 మంది సిబ్బందిని పంపినట్లు పేర్కొన్నారు.
వరదలకు కూలిన వంతెన- 11మంది మృతి- 30మంది మిస్సింగ్
Published : Jul 20, 2024, 12:43 PM IST