Sudan Dam Collapse : ఆఫ్రికా దేశమైన సుడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఓ డ్యామ్ కూలిన ఘటనలో పలువురు మృతి చెందారు. భారీ వర్షాలు కారణంగా రెడ్ సీ స్టేట్‌లో అర్బాత్ డ్యామ్ కూలిపోయింది. భారీగా వరద నీరు గ్రామాల్లోకి పోటెత్తింది. వరదలకు అనేక ఇళ్లు ధ్వంసం కాగా వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. పలువురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కొండ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ దుర్ఘటన కారణంగా తీవ్ర ఆస్తి నష్టం వాటిలినట్లు రెడ్ సీ స్టేట్ నీటిపారుదల శాఖ అధికారి పేర్కొన్నారు. అయితే, దాదాపు 60 మంది మరణించి ఉండొచ్చని సూడాన్ వార్తా ఛానెల్ పేర్కొంది. 100 మంది ఆచూకీ లభించలేదని మరో వార్తా సంస్థ వెల్లడించింది. మొత్తంగా మొబైల్ నెట్‌వర్క్ పనిచేయకపోవడం వల్ల సమాచార సేకరణ ఇబ్బందిగా మారినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
భారీ వర్షాలకు కుప్పకూలిన డ్యామ్- 60 మంది మృతి, 100 మంది ఆచూకీ గల్లంతు!
Published : Aug 26, 2024, 9:11 PM IST