ETV Bharat / snippets

ఆ రికార్డుకు అడుగు దూరంలో 'కల్కి' - 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 2:53 PM IST

source ETV Bharat
Prabhas Kalki 2898 AD collections worldwide (source ETV Bharat)

Prabhas Kalki 2898 AD collections worldwide : ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ విడుదలై 11 రోజులు అయినా బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వరల్డ్ వైడ్​గా ఈ చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకుపైగా గ్రాస్​ వసూలు చేసినట్లు మూవీటీమ్​ అఫీషియల్​గా ప్రకటించింది. బాలీవుడ్‌లోనూ బాహుబలి, ఆర్‌ఆర్ఆర్‌ తర్వాత రూ.200 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన మూవీ ఇదే. ఇక ప్రభాస్ సినిమాల పరంగా కల్కి రెండో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగానూ నిలిచింది. నార్త్‌ అమెరికాలో ఇప్పటివరకూ ఏ సౌత్​ మూవీ సాధించని విధంగా 16 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని అంచనా. ఇంకా బుక్‌ మై షోలోనూ కోటికి పైగా టికెట్ల విక్రయమైన చిత్రంగానూ సెన్సేషనల్ సృష్టించింది. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో అతి తక్కువ సమయంలోనే రూ.3కోట్లు వసూలు చేసిన చిత్రంగానూ కల్కి రికార్డుకెక్కింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.