Nagarjuna Apologises : అక్కినేని నాగార్జున ముంబయి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది. నాగార్జున బయటికి రావడం చూసిన ఓ అభిమాని ఆయన్ను కలిసేందుకు దగ్గరికి వచ్చాడు. అయితే ఇది గమనించిన బాడీగార్డ్ క్షణాల్లో ఆ వ్యక్తిని పక్కకి లాగేశాడు. దీంతో ఆ అభిమాని కింద పడినంత పని అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
దీంతో మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు నాగార్జునను విమర్శించారు. అయితే వాస్తవానికి తన బాడీగార్డ్ అభిమానిని పక్కిన లాగిన ఘటనను చూడలేదు నాగార్జున. తాజాగా ఈ విషయం తన దృష్టికి రావడంతో స్పందించారు. "ఈ ఘటన ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇలాంటిది జరిగి ఉండాల్సింది కాదు. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను." అంటూ నాగ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.