ETV Bharat / snippets

వారికి మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్​ - రెండు రోజులే టైమ్ ఇస్తున్నానంటూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 9:18 PM IST

source ETV Bharat
Vishnu Manchu Strong Warning (source ETV Bharat)

Vishnu Manchu Strong Warning to the Youtubers : నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను మా అధ్యక్షుడు మంచువిష్ణు హెచ్చరించారు. నటీనటులు, వారి కుటుంబసభ్యులపై అశ్లీలంగా పెట్టిన వీడియోలు, పోస్టులను 48 గంటల్లో తొలగించాలని సూచించారు. లేదంటే ఆ యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఛానల్స్​ను మూసివేయించనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓ చిన్నారిపై అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఉదంతంపై స్పందించారు మంచు విష్ణు. ఆ వీడియోలోనే మహిళలను కించపరిచేలా వ్యవహారించిన ఆ యూట్యూబర్​పై చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో మా అసోసియేషన్​కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్ రాస్తున్నారని, తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు విష్ణు పేర్కొన్నారు. వారి అభ్యర్థనపై స్పందించిన విష్ణు సామాజిక మాద్యమాల ద్వారా నటీనటుల వ్యక్తిత్వాన్ని కించపరిస్తూ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లకు హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.