ETV Bharat / state

కబ్జా చేస్తే 14 ఏళ్లు కటకటాలే - భూ ఆక్రమణల నియంత్రణకు కొత్త చట్టం! - IMPRISONMENT FOR LAND GRAB IN AP

భూ కబ్జాదారులకు ఏపీ ప్రభుత్వం షాక్​ - భూ ఆక్రమణలకు పాల్పడితే 14 ఏళ్లు జైలు శిక్ష, భారీ జరిమానా - ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -1982 స్థానంలో కొత్త చట్టం

AP Cabinet Meeting Key Decisions
AP Cabinet Meeting Key Decisions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 1:00 PM IST

AP Cabinet Meeting Key Decisions : ఏపీలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాదారులకు భారీ జరిమానా, 14 ఏళ్లు జైలుశిక్ష వేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి.

పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్ : ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం -1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -2024 అమలుకు బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాత చట్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడం వంటి వాటిని నిరోధించేది. ఇప్పుడు ఈ చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితం అవ్వగా, దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేవారు. కానీ కొత్త చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూములు రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, పరిహారం, భూమి విలువతో పాటు జరిమానా విధించనున్నారు. దీనికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.

మంత్రివర్గంలో నిర్ణయాలు : ఏపీ డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు సైతం మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్​డీఏ) పరిధిని పెంచడానికి ఆమోదం తెలిపారు. ఈ మంత్రివర్గ సమావేశం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో జరిగిన సంగతి తెలిసిందే.

'ఆ పోస్టులకు తట్టుకోలేకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది'- పవన్ కల్యాణ్​ క్లారిటీ !

పింఛన్​దారులకు సర్కార్​ తీపికబురు - ఒకేసారి 3 నెలల డబ్బులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.