ETV Bharat / snippets

టికెట్​ బుకింగ్స్​లో 'కల్కి' ఆల్​టైమ్​ రికార్డ్​ - ఎన్ని అమ్ముడుపోయాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 12:14 PM IST

source ETV Bharat
Kalki 2898AD Ticket Bookings Record (source ETV Bharat)

Kalki 2898AD Ticket Bookings Record : ప్రభాస్, అమితాబ్​​ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడీ విడుదలై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్​అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.1000కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఓవర్సీస్​లోనూ రికార్డ్ స్థాయి కలెక్షన్లను అందుకుంది. అయితే తాజాగా కల్కి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఒకవైపు కలెక్షన్స్ పరంగా రికార్డులు నమోదు చేస్తున్న ఈ చిత్రం మరోవైపు టిక్కెట్ల అమ్మకాలలోనూ ఆల్ టైమ్ రికార్డ్‌ను సాధించింది. టికెట్స్ బుకింగ్ యాప్ బుక్‌మైషోలో జూన్ 27 - జులై 17 వరకు మొత్తం 12.15 మిలియన్ల టికెట్స్ అమ్మకాలను జరుపుకున్నట్లు BMS తెలిపింది. ఇండియన్ సినిమా హిస్టరీలో, అలాగే బుక్ మై షోలో ఇది రికార్డు. అంతకుముందు బుక్‌మైషోలో ఇప్పటివరకు అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా షారుక్​ జవాన్(12.01M) ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.