ETV Bharat / snippets

ప్రభాస్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన అమితాబ్ - ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 10:37 AM IST

source ETV Bharat
Amitabh Apologises Prabhas Kalki2898 AD (source ETV Bharat)

Amitabh Apologises Prabhas Kalki2898 AD : ప్రభాస్ 'కల్కి' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ భారీగా అంచనాల్ని పెంచేశాయి. భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ ఫైట్ సీన్స్ హైలైట్​గా నిలిచాయి. టికెట్ బుకింగ్స్ కూడా ఓపెనై హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీటీమ్ అంతా కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అమితాబ్ ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. 'నాగ్​అశ్విన్​ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నాపాత్ర ఎలా ఉండబోతుందో, ప్రభాస్ పాత్ర ఏంటనేది చెప్పారు. సినిమాలో నాది ప్రభాస్‪‌ను కొట్టే పాత్ర. ప్రభాస్ అభిమానులంతా దయచేసి నన్ను క్షమించాలి. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి' అని అమితాబ్ అన్నారు. దీనికి ప్రభాస్ నవ్వుతూ 'అయ్యో సర్, వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా!' అని తిరిగి అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.