ETV Bharat / snippets

ఓవర్సీస్​లో కల్కి హవా - ఒక్కరోజులోనే ఎన్ని టికెట్స్‌ అమ్ముడయ్యాయంటే

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 3:07 PM IST

Source ETV Bharat
Kalki2898AD (Source ETV Bharat)

Kalki2898AD Tickets : సినీప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. అయితే ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఓవర్సీస్‌లో జూన్‌ 26నే రిలీజ్ కానుంది. దీంతో అక్కడ అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని దాదాపు 124 లోకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేస్తే ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం అందుతోంది. కాగా, ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించగా ప్రభాస్ భైరవ్​గా కనిపించనున్నారు. జూన్‌ 10న ట్రైలర్‌ రానుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొణె నటిస్తుండగా సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. అలాగే పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.