ETV Bharat / snippets

'ఉస్తాద్​ భగత్ సింగ్​' - ఆ వ్యక్తికి హరీశ్​ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 5, 2024, 3:07 PM IST

source ETV Bharat
Ustaad Bhagat Singh HarishShankar (source ETV Bharat)

Ustaad Bhagat Singh HarishShankar : గబ్బర్‌సింగ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవన్‌కల్యాణ్‌ - హరీశ్​శంకర్‌ కాంబోలో రావాల్సిన చిత్రం ఉస్తాద్ భగత్‌ సింగ్‌. షూటింగ్ విషయంలో అనేక సార్లు వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇప్పటికే పలుసార్లు ప్రచారం సాగింది. దానికి హరీశ్ సమాధానం ఇస్తూనే వస్తూ పుకార్లను కొట్టిపారేస్తున్నారు. తాజాగా మళ్లీ అదే చేశారు. ఉస్తాద్ భగత్‌ సింగ్‌ ఆగిపోయిందంటూ ఎక్స్‌లో ఒకరు పోస్ట్‌ చేయగా వారికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. "సినిమా ప్రారంభంకాలేదని రూమర్స్‌ వచ్చినప్పుడే పట్టించుకోలేదు. ఇప్పుడు ఇలాంటి వాటి గురించి చదివే సమయం కూడా లేదు" అంటూ బదులిచ్చారు. కాగా, ఈ సినిమాలోని ముఖ్యమైన సీన్స్​ చిత్రీకరణ పూర్తైందని గతంలోనే హరీశ్ చెప్పారు. సినిమాలో ఎప్పటిలాగే పవన్‌ పవర్‌ఫుల్‌గా కనిపిస్తారని పేర్కొన్నారు. శ్రీలీల హీరోయిన్. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే హరీశ్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.