ETV Bharat / snippets

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం - 'నాటునాటు'కు రెడీ అవ్వండి ఫ్యాన్స్​

source ETV Bharat
Ram Charan IFFM 2024 (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 3:34 PM IST

Ram Charan IFFM 2024 : గ్లోబల్ స్టార్ రామ్​చ‌ర‌ణ్‌కు అరుదైన గౌర‌వం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్​కు చరణ్‌ చీఫ్​ గెస్ట్​గా వెళ్లనున్నారు. అతిథిగా వెళ్లడమే కాదు ఇండియన్​ సినిమాకు చేసిన సేవలకుగాను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డును కూడా అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అఫీషియల్​గా అనౌన్స్​ చేసింది. "మాతో నాటు నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారు" అంటూ రాసుకొచ్చింది. ఈ విషయంపై రామ్​చరణ్ కూడా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్​లో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కాగా, విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ఫిల్మ్​ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15-25 వరకు ఈ ఫెస్టివల్‌ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.