ETV Bharat / snippets

కథ ముగిసిపోలేదు - తిరిగి పైకి లేస్తా! : సమంత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 5:18 PM IST

source ETV Bharat
samantha (source ETV Bharat)

Citadel Samantha : హీరోయిన్​ సమంత నటించిన లేటెస్ట్​ యాక్షన్‌ థ్రిల్లర్​ సిటడెల్‌ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సామ్​ ఆసక్తికర విషయాలను మాట్లాడింది. "మా ఇద్దరి(వరుణ్​ధావన్​తో) మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే షూట్‌ చక్కగా కంప్లీట్​చేశాం. 12 నిమిషాల యాక్షన్​సీన్‌ను సింగిల్‌ టేక్‌లో షూట్​చేశాం. యాక్షన్​ప్రియులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. వరుణ్‌ధావన్‌ వర్క్ పట్ల అంకితభావంతో ఉంటాడు. మంచి మనసు ఉన్న వ్యక్తి" అని చెప్పుకొచ్చింది. అలానే 'లైఫ్​లో క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారు?' అని అడగగా "కొన్నిసార్లు చేతులెత్తేస్తాను. అయితే, అక్కడితో కథ ముగిసిపోయిందని కాదు. తిరిగి పైకి లేస్తాను" అని చెప్పింది. కాగా, ఫ్యామిలీ మ్యాన్‌2 తర్వాత రాజ్‌ అండ్‌ డీకేతో సమంత చేసిన రెండో సిరీస్​ ఇది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.