ETV Bharat / snippets

'ఒకటి కన్నా ఎక్కువ ఫోన్​ నంబర్లుంటే ఛార్జీ'- క్లారిటీ ఇచ్చిన ట్రాయ్​

Phone Number Charges
Phone Number Charges (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 7:52 PM IST

Phone Number Charges : ఒకటి కన్నా ఎక్కువ ఫోన్‌ నంబర్లు ఉంటే ఛార్జీ వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్‌) స్పష్టతనిచ్చింది. అవన్నీ పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేసింది. ఈమేరకు ట్రాయ్‌ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఫోన్‌ నంబర్లకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేసే ప్రణాళిక లేదని తేల్చిచెప్పింది. నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌పై ఇటీవల టెలికాంశాఖ తమను సంప్రదించి ప్రతిపాదనలు కోరిందని వెల్లడించింది. నంబరింగ్‌ వనరుల సమర్థ వినియోగం కోసం సూచనలు ఇవ్వాలని అడిగినట్లు తెలిపింది. ఈమేరకే తాము చర్చాపత్రం విడుదల చేశామన్న ట్రాయ్‌, నంబర్ల కేటాయింపు విధానాల్లో కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించామని పేర్కొంది. నంబరింగ్‌ వనరుల నియంత్రణ కోసం ట్రాయ్‌, రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌ పేరుతో ఇటీవలె చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఈక్రమంలోనే ఫోన్‌ నంబర్లపై ఛార్జీ విధించాలని ట్రాయ్‌ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.