First Vande Metro launch : మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఏర్పాటు చేసిన వందే మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఈనెల 16న ప్రధానమంత్రి మోదీ ఈ సేవలను ప్రారంభించనున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్- భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. వందే మెట్రో అనేది పూర్తి అన్‌రిజర్వ్‌డ్ ఎయిర్ కండీషన్‌తో ఉంది. ఇందులో 1150 మంది కూర్చుని, 2058 మంది నిల్చుని ప్రయాణం చేయొచ్చని అహ్మదాబాద్ పీఆర్‌ఓ ప్రదీప్ శర్మ తెలిపారు. గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు కొన్ని నిమిషాల ముందే టికెట్ కొనుక్కుని రైలు ఎక్కొచ్చని పేర్కొన్నారు. వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్‌లు, కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. టికెట్ కనీస ధర రూ.30గా నిర్ణయించినట్లు తెలిసింది.
దేశంలో తొలి వందే మెట్రో సేవలు - ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Published : Sep 15, 2024, 8:26 AM IST