Supreme Court New Judges : తర్వలో సుప్రీంకోర్టు పూర్తిస్థాయి సామర్థ్యంతో పని చేయనుంది. ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమితులైనట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుప్రీం కోర్టుకు నూతన న్యాయమూర్తులుగా జమ్ము కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహదేవన్‌ను పేర్లను ప్రకటించారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపుర్ వాస్తవ్యులు. ఆ రాష్ట్రం నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందించే తొలి వ్యక్తిగా ఆయన రికార్డును సొంతం చేసుకోనున్నారు. త్వరలోనే వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో సుప్రీంకోర్టులోని మొత్తం 34 జడ్జిల పోస్టులన్నీ భర్తీ అవుతాయి.
ఫుల్ స్ట్రెంత్తో సుప్రీంకోర్టు- కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
Published : Jul 16, 2024, 2:38 PM IST