ETV Bharat / snippets

'వలస కూలీలకు 4 వారాల్లో రేషన్‌ కార్డులు జారీ చేయాలి' - రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం

SC On Migrant Labourers
SC On Migrant Labourers (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 6:46 AM IST

SC On Migrant Labourers : వలస కూలీలకు రేషన్​కార్డుల జారీని జాప్యం చేస్తోన్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇప్పటికే 4 నెలల సమయం ఇచ్చినా తనిఖీని పూర్తి చేయకపోగా, మరో 2 నెలల గడువు కోరడాన్ని ఆక్షేపించింది. ఇంతటి జాప్యం దురదృష్టకరమని, రేషన్​ కార్డుల కోసం ఇ-శ్రమ్ పోర్టల్​ ద్వారా నమోదు చేసుకున్న వలస కూలీల పేర్ల పరిశీలను 4 వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. గడువులోపు కార్డుల జారీలో విఫలమైతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తామని జస్టిస్‌ సుధాంశు ధూలియా, జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం హెచ్చరించింది. వలస కూలీల పేర్ల పరిశీలనను బిహార్, తెలంగాణ రాష్ట్రాలు 100% పూర్తి చేశాయన్న విషయాన్ని ధర్మాసనం నోట్‌ చేసుకుంది. తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందటానికి సుమారు 8కోట్ల మంది వలసకూలీలు ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.