SBI Quarter 2 Results 2024 : బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో(క్యూ2) రూ.19,782 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.16,099 కోట్లతో పోలిస్తే 23 శాతం వృద్ధి చెందింది. స్టాండలోన్ పద్ధతిన నికర లాభం రూ.14,330 కోట్ల నుంచి రూ.18,331 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.17,035 కోట్లుగా ఉందని ఎస్బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఎస్బీఐ నికర ఆదాయం రూ.1.12 లక్షల కోట్ల నుంచి రూ.1.29 లక్షల కోట్లకు పెరిగింది. ఖర్చులు గతేడాది రూ.92,752 కోట్ల నుంచి రూ.99,847 కోట్లకు పెరిగినట్లు ఎస్బీఐ వెల్లడించింది. నిరర్థక ఆస్తుల కోసం ప్రొవిజన్లు రూ.1,814 కోట్ల నుంచి రూ.3,631 కోట్లకు పెరిగాయని పేర్కొంది. క్యూ2 ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ షేరు 1.60 శాతం క్షీణించి రూ.845 వద్ద ట్రేడవుతోంది.