Sadhguru Condemns Attacks On Hindus : బంగ్లాదేశ్లో హిందువుల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థలపై జరుగుతున్న దాడులపై ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. మన పొరుగున ఉన్న మైనారిటీలకు భద్రత కల్పించడం మన బాధ్యత అని ఉద్ఘాటించారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు కేవలం బంగ్లాదేశ్ అంతర్గత విషయంగా చూడలేమని సద్గురు తెలిపారు. మన పొరుగున ఉన్న మైనారిటీల భద్రత కోసం వీలైనంత త్వరగా నిలబడాలని పిలుపునిచ్చారు. లేకపోతే భారత్, 'మహా భారత్' కాదన్నారు. కొన్ని కారణాల వల్ల ఈ దేశంలో భాగమైన ప్రాంతం పొరుగు ప్రాంతంగా మారిందని తెలిపారు. బంగ్లాదేశ్లో దాడుల నుంచి ఈ దేశమూలాలు ఉన్న వారిని రక్షించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.