ETV Bharat / snippets

రాజ్యసభ ఉపఎన్నికల్లో 12మంది ఏకగ్రీవ ఎన్నిక- మెజార్టీ మార్క్ తాకిన NDA

Rajya Sabha Bypoll Polls Results 2024
Rajya Sabha (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 8:29 PM IST

Rajya Sabha By Polls Results 2024 : రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా, తొమ్మిది స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్డీఏకు ఎగువ సభలో మెజార్టీ మార్కును అందుకుంది. తాజాగా రాజ్యసభలో బీజేపీ బలం 96కి చేరగా, మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఆ బలం 112గా ఉంది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్‌, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్‌ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడం వల్ల రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.