PM Modi Ukraine Visit : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23న మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను మొదలుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ, కీవ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. అంతకుముందు భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన మోదీకి జెలెన్‌స్కీ ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఉక్రెయిన్‌లో పర్యటించాలని మోదీని కోరిన క్రమంలోనే ప్రధాని కీవ్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్‌ని ఆత్మీయ ఆలిగంనం చేసుకున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన జెలెన్‌స్కీ ఆ పరిణామాలు తనను తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు.
ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ! జెలెన్‌స్కీతో వ్యూహాత్మక చర్చలు!
Published : Jul 27, 2024, 10:52 AM IST