ETV Bharat / snippets

ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తల్లీకొడుకులు- ఇద్దరిలో 'ఆమె'కే ఎక్కువ మార్కులు

Mother Son Duo Passes Out In Exam
Mother Son Duo Passes Out In Exam (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 9:23 AM IST

Mother Son Duo Passes Out In Exam : చదవాలనే ఆసక్తి ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ. తన కుమారుడితో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కుమారుడి కన్నా ఎక్కువ మార్కులు కూడా సాధించింది.

కుర్లా ప్రాంతానికి చెందిన గీత పాసి 2003లో ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు రాశాక కొన్ని కారణాల వల్ల చదువుకు స్వస్తి పలికింది. ఆ తర్వాత ఏడాదే పెళ్లి చేసుకుంది. ఇక ఆమె కుమారుడు ఆర్యన్ 12వ తరగతి చదువుతుండడం వల్ల తాను కూడా పరీక్షలు రాసి ఇంటర్ పూర్తి చేయాలనుకుంది. పరీక్షలకు ఫీజు కట్టి ఇంట్లోనే చదువుకుంది. రోజూ ఉదయమే లేచి చదువుకుని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకునేది. పరీక్షల్లో మంచి మార్కులతో పాసైంది. ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ కష్టపడి చదివి విజయం సాధించిన గీతను అందరూ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.