ETV Bharat / snippets

45మంది అభ్యర్థులతో శివసేన ఫస్ట్ లిస్ట్- సీఎం శిందే అక్కడి నుంచే పోటీ

Maharashtra Polls
Maharashtra Polls (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 18 hours ago

Maharashtra Polls Sivasena List : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శివసేన పార్టీ విడుదల చేసింది. కోప్రి-పాచ్​పఖాడీ అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. తొలి జాబితాలో ఆరుగురు క్యాబినెట్ మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది.

జల్గావ్ రూరల్, సావంత్‌వాడి, సిల్లోడ్, పటాన్ నుంచి గులాబ్రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, అబ్దుల్ సత్తార్, శంబురాజ్ దేశాయ్ వరుసగా పోటీలో చేయనున్నట్లు తెలిపింది. ప్రముఖ నేత సదా సర్వాంకర్ ముంబయిలోని మహిమ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారని చెప్పింది. మరోవైపు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే తొలిసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. మహిమ్ నుంచే పోటీ చేయనున్నారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 45 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం ఎంఎన్ఎస్ విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.