TDP Released Sharmila Letter to Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తి పంపకాలపై మొదలైన వివాదం మరో మలుపు తిరిగింది. జగన్ తీరును విమర్శిస్తూ, ఆయన వ్యవహారశైలి, ఆస్తి కోసం ఎలా ఇబ్బందులు పెడుతున్నాడో తెలుపుతూ షర్మిల గతంలో రాసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ లేఖను అధికార తెలుగుదేశం పార్టీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది.
" నన్ను రాజకీయంగా ఏమి అనకు, రాజకీయంగా నాకు అడ్డు రాకు, అప్పుడు నీకు ఆస్తులు రాసిస్తా..."
— Telugu Desam Party (@JaiTDP) October 23, 2024
సొంత చెల్లి షర్మిలని బెదిరిస్తూ లేఖ రాసిన సైకో జగన్
"నన్ను రాజకీయంగా ఇబ్బందులు పెడుతుంటే, నీకు నేను ఆస్తులు ఎందుకు ఇవ్వాలి ? రాజకీయంగా నా పై విమర్శలు చేస్తున్న నీకు, నేను చిల్లి గవ్వ… pic.twitter.com/9w0tpvLsPQ
జగన్ ఈ ఏడాది ఆగస్ట్27నే షర్మిలకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తనను రాజకీయంగా అడ్డుకుంటున్నారని, అసలు షర్మిలకు ఆస్తులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నందుకు నీకు, చిల్లి గవ్వ ఇవ్వనని లేఖలో తేల్చిచెప్పారు. తల్లి విజయమ్మ,నీ మీద కేసు వేస్తున్నానని బెదిరింపు ధోరణిలో జగన్ ఈ లేఖ రాశారు. దానికి కౌంటర్‌గా సెప్టెంబరు 12న జగన్‌కు షర్మిల 8 అంశాలతో లేఖ రాసింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడా లేఖనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
లేఖలో షర్మిల ఏం చెప్పారంటే?
"మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకు అంగీకరిస్తున్నానని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకు నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా." -లేఖలో షర్మిల
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు - తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్