ETV Bharat / spiritual

రాహు, కేతు దోషాలు పోగొట్టే కాలాష్టమి - ఈ పూజ చేస్తే చాలు - సకల కష్టాలు తొలగడం ఖాయం!

కాలాష్టమి వ్రత మహాత్యం - కాలభైరవుని పూజిస్తే చాలు - రాహు, కేతు దోషాలు ఇట్టే మటుమాయం!

Rahu-Ketu
Rahu-Ketu (ETV bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How To Remove Rahu Ketu Doshams : ఎవరికైనా జాతకం ప్రకారం రాహు, కేతు దోషాలుంటే - జీవితంలో అభివృద్ధి లేకపోవడం, ఆదాయం నిలకడగా లేకపోవడం, అపమృత్యు దోషాలు వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులను పోగొట్టుకోడానికి సులభమైన పరిష్కారం ఒకటుంది. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

కాలాష్టమి విశిష్టత
కాలాష్టమి శివారాధకులకు విశిష్టమైన రోజు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే శివుని ఆశీర్వాదంతో సకల శ్రేయస్సు, సుఖ సంతోషాలు సొంతమవుతాయని విశ్వాసం. అంతేకాదు భక్తిశ్రద్ధలతో కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని శాస్త్ర వచనం. అందుకే కాలాష్టమి అంటే ఏమిటి? ఆ రోజు ఏ దేవుని పూజించాలి? అనే విషయాలను విపులంగా తెలుసుకుందాం.

కాలాష్టమి అంటే?
తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమిని కాలాష్టమిగా జరుపుకుంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి తిథి కాల భైరవుడిని ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున, భక్తులు భైరవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసాన్ని పాటిస్తారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఆశ్వయుజ బహుళ అష్టమిని కాలాష్టమిగా జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

కాలాష్టమి పూజకు శుభసమయం
అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కాలభైరవ పూజకు శుభసమయం. అయితే సాధారణంగా కాలభైరవ పూజ సాయంత్రం సమయంలో చేస్తారు. కాబట్టి సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా పూజ చేసుకోవచ్చు.

కాలాష్టమి రోజు ఏ దేవుని పూజించాలి
హిందూ పురాణాల ప్రకారం, కాలాష్టమి రోజు పరమ శివుని అవతారమైన కాలభైరవుని పూజించడం సంప్రదాయం.

కాలాష్టమి పూజా విధానం
కాలాష్టమి వ్రతం ఆచరించే వారు ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీస్నానం చేయడం ఉత్తమం. కొంత మంది భక్తులు ఈ రోజంతా కఠినమైన ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తూ మహాకాళేశ్వరుని కథలు వింటూ కాలక్షేపం చేస్తారు. ఈ రోజు శివుని ప్రతిరూపమైన కాలభైరవుని భక్తిశ్రద్ధలతో పూజించాలి.

ఆలయాలలో పూజ
సాయంత్రం వేళ భక్తులు కాలభైరవుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. దాదాపుగా ప్రతి శివాలయంలో కాలభైరవుని విగ్రహం కూడా ఉంటుంది. కాలభైరవుని సమక్షంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. శివ స్తోత్రం, కాలభైరవాష్టకం పఠించాలి. అనంతరం 11 ప్రదక్షిణలు చేయాలి. కాల భైరవునికి కొబ్బరికాయ, నల్ల బెల్లం, రొట్టెలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో భైరవునికి మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

శునక పూజ
కాలాష్టమి రోజు కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించడం కూడా సంప్రదాయంలో భాగమే! ఈ రోజు నల్ల కుక్కకు పొట్టు మినప్పప్పుతో చేసిన గారెలు, పెరుగు అన్నం ఆహారంగా ఇస్తారు. అనంతరం కాలాష్టమి వ్రత కథను చదువుకోవాలి.

కాలాష్టమి వ్రతకధ
శివ పురాణం ప్రకారం, కాలాష్టమి రోజు కాల భైరవుడిని ఆరాధించడం వలన నవ గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావాలు, రాహు కేతు గ్రహాల అరిష్ట ప్రభావాలు కూడా తొలగిపోతాయి. అందుకే కాల భైరవ జననం వెనుక కథ తెలుసుకుందాం.

కాలభైరవ జననం
పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. ఈ వివాదం ఎంతకూ ముగియకపోవడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వదేవతలను సమావేశపరచారు. చర్చోపచర్చలు తర్వాత దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారు. దేవతల తీర్పును శివుడు, విష్ణువు అంగీకరించారు. అయినప్పటికీ, బ్రహ్మ దేవుడు సంతృప్తి చెందకుండా శివుని అవమానించాడు. ఇందుకు ఆగ్రహించిన శివుడు కాల భైరవుడిగా ఉగ్ర రూపాన్ని ధరించాడు.

శివుని ఉగ్ర రూపమైన కాలభైరవుని రూపానికి దేవతలందరూ భయంతో తలో దిక్కుకు పారిపోయారు. కాల భైరవుడు తన వాహనమైన నల్ల కుక్కను అధిరోహించి బ్రహ్మదేవునిపై దాడి చేసి, బ్రహ్మదేవుని అయిదు శిరస్సులలో ఒక శిరస్సును ఖండించాడు. అప్పటి వరకు ఐదు తలలు ఉన్న బ్రహ్మదేవుడు ఆనాటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా మారాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో బ్రహ్మ, శివుని శరణువేడాడు. అంతట శివుడు ప్రసన్నుడై నిజరూపం ధరించాడు.

శివునికి బ్రహ్మహత్యా పాతకం
బ్రహ్మ శిరస్సును ఖండించిన శివుని స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసికి చేరుకున్నాడు. అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది. అందుకే కాశీకి వెళ్ళినవారు కాలభైరవుని తప్పకుండా దర్శించుకోవాలి.

కాలాష్టమి వ్రత మహాత్యం
ఆదిత్య పురాణం - కాలాష్టమి రోజు శివుని స్వరూపంగా భావించే కాల భైరవుడిని పూజించాల్సిన ఆవశ్యకతను వివరిస్తుంది. ఈ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజించడం వల్ల జీవితంలో ప్రతికూల శక్తులు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే భక్తిశ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి ఆరోగ్యం, శ్రేయస్సు కలుగుతాయి. కాలభైరవుని అనుగ్రహంతో రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్ర వచనం. అంతేకాదు ప్రతి నెలా కాలాష్టమి వ్రతాన్ని ఆచరించే వారు దుష్టశక్తుల ప్రభావం నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు. కాలాష్టమి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తికి దుఃఖాలు, అనారోగ్యాలు, శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక కాలాష్టమి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. సమస్త గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుదాం.

ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.