WhatsApp New Feature for Easy Contact Management: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ సహాయంతో కొత్త కాంటాక్ట్‌ను ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. అంటే కాంటాక్ట్ సేవ్ చేసే సమయంలో కేవలం వాట్సప్‌లో యాడ్ చేయాలా? లేదా మొబైల్లోనూ యాడ్ చేయాలా? అనే రెండు ఆప్షన్లు కన్పించనున్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకుని కాంటాక్ట్‌ను సేవ్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా, మొబైల్‌ని మార్చినా వాట్సప్‌లోని కాంటాక్ట్స్ మాత్రం అలాగే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది. త్వరలోనే ఈ సరికొత్త ఫీచర్ వాట్సప్ వెబ్, విండోస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇంతకుముందు వాట్సప్‌లోని చాట్లు పేరుతో కనిపించాలంటే ప్రైమరీ డివైజ్‌లోనే కాంటాక్ట్‌ని సేవ్ చేయాల్సి ఉండేది. లింక్డ్ డివైజెస్‌లో సేవ్ చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో ఒకటి కంటే ఎక్కువ డివైజుల్లో వాట్సాప్‌ని ఉపయోగించే వాళ్లు పేర్లు యాడ్ చేసేందుకు ప్రతిసారీ ప్రైమరీ డివైజ్‌కు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వాట్సాప్ ఈ సమస్యకు చెక్ పెడుతూ లింక్ చేసిన పరికరాల్లోనూ కాంటాక్ట్‌ని సేవ్ చేసేలా సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త కాంటాక్ట్‌ని ప్రత్యేకంగా వాట్సప్‌లోనే సేవ్ చేసేలా కొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు కసరత్తులు మొదలుపెట్టింది.
దీంతోపాటు మరో ఇంట్రస్టింగ్ వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్ తీసుకొచ్చేందుకు ఈ మెసేజింగ్ యాప్ కసరత్తు చేస్తోంది. ఇది మెటా ఏఐతో షేర్ చేసిన పర్సనల్ డేటాను రికార్డ్ చేసేందుకు ఉపయోగపడనుంది. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారం, సూచనలను ఇవ్వనుంది. అంటే ఇది మనకు పర్సనల్ అసిస్టెంట్‌గా ఉపయోగపడుతుందన్న మాట. ఈ వాట్సాప్ చాట్ మెమరీ ఫీచర్‌పై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్- ఇకపై ఆన్లైన్ మోసాలకు చెక్..!
BSNL యూజర్స్‌కు ఫ్రీ Wi-Fi కనెక్షన్- వావ్.. ఆఫర్ అదిరిందిగా..!