Lok Sabha Election Results 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత శంకర్ లల్వానీ సరికొత్త చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ స్థానం నుంచి ఆయన ఏకంగా 10,08,077 ఓట్ల అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి మొదట పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్ ముండే పేరుతో అత్యధిక మెజార్టీ రికార్డు (6.9లక్షలు) ఉండగా శంకర్ లల్వానీ దాన్ని అధిగమించారు. ఇక ఈ నియోజకవర్గం నుంచి రెండో స్థానంలో నోటా ఉంది. దాదాపు 2.18 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో ఇందౌర్ నోటాకు అత్యధికంగా ఓట్లు పడిన స్థానంగా రికార్డుకెక్కింది.
లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డ్- 10లక్షల మెజార్టీతో ఇందౌర్ అభ్యర్థి ఘన విజయం
Published : Jun 4, 2024, 1:53 PM IST
|Updated : Jun 4, 2024, 5:17 PM IST