ETV Bharat / snippets

నిరసన కొనసాగిస్తామన్న జూనియర్ డాక్టర్లు - సుప్రీం ఆదేశాలు ఇచ్చినా సరే!

Kolkata Junior Doctors Strike
Kolkata Junior Doctors Strike (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 7:55 AM IST

Kolkata Junior Doctors Strike : మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు. హత్యాచార బాధితురాలికి న్యాయం జరిగే వరకు విధుల బహిష్కరణ కొనసాగిస్తామని వెల్లడించారు . బంగాల్‌ ఆరోగ్య కార్యదర్శి, వైద్యవిద్య డైరెక్టర్ రాజీనామాలు కోరుతూ మంగళవారం మధ్యాహ్నం సాల్ట్‌ లేక్‌లోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయమైన స్వస్థ్య భవన్‌కు ర్యాలీ చేపడతామని తెలిపారు. బాధితురాలికి న్యాయం దక్కకపోవడమే కాకుండా తమ డిమాండ్లు నెరవేరలేదని జూనియర్ వైద్యులు తెలిపారు.

ఆర్​జీ కర్ వైద్యురాలి హత్యాచారం ఘటన జరిగిన దగ్గర నుంచి జూనియర్ వైద్యులు విధులు నిర్వహించకుండా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు కారణంగా కారణంగా 23 మంది రోగులు చనిపోయారని బంగాల్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఏ నిరసనైనా విధులను విస్మరించి చేయడం సరికాదని, మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.