ETV Bharat / snippets

'కావడి యాత్ర'​​ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 7:12 AM IST

Kanwar Yatra 2024
Kanwar Yatra 2024 (ANI)

Kanwar Yatra 2024 : కావడి యాత్ర మార్గంలో ఆహార దుకాణాలపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని యూపీ సర్కార్‌ జారీ చేసిన ఉత్తర్వులపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎన్​వీఎన్​ భట్‌ల ధర్మాసనం విచారణ చేయనుంది.

నేటి నుంచే కావడి యాత్ర
సోమవారం నుంచే కావడి యాత్ర ప్రారంభం అవుతుంది. ఏటా శ్రావణ శుక్రవారంలో జరిపే ఈ యాత్రలో శివభక్తులు నెల రోజులపాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తీసుకువెళ్తారు. యాత్రకు వచ్చే భక్తుల కోసం అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కావడి యాత్ర మార్గంలో ఆహార దుకాణాలపై యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, వీహెచ్​పీ స్వాగతించగా, విపక్షాలతోపాటు ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎల్​జేపీ, జేడీయూ, ఆర్​ఎల్​డీ పార్టీలూ తప్పుపట్టాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.