July Rainfall In India India : జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణం శాఖ(IMD) సోమవారం తెలిపింది. దేశంలో ఈ నెలలో 147.2mm నమోదైందని, సగటు వర్షపాతం 165mm అని పేర్కొంది. వాయువ్య భారతంలో 33శాతం, మధ్య భారతంలో 14శాతం, తూర్పు, ఈశాన్య భారతంలో 13శాతం లోటు నమోదైందని IMD పేర్కొంది. జూన్‌లో దక్షిణ భారత్లో మాత్రమే మిగులు వర్షాలు(14 శాతం) నమోదయ్యాయని తెలిపింది. అయితే ఈశాన్యంలో కొన్ని ప్రాంతాలు మినహా జులైలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువ నమోదవుతుందని IMD వెల్లడించింది. దీర్ఘకాల సగటు 28.04cm కన్నా 106శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. పశ్చిమ తీరం మినహా వాయువ్య, దక్షిణ భారత్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. జులైలో మంచిగా వర్షాలు పడతాయని, మేఘావృతమైన పరిస్థితుల వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలకు నమోదవుతాయని IMD చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర చెప్పారు.
జూన్ నిరాశ పరిచినా, జులైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం : IMD
Published : Jul 1, 2024, 8:46 PM IST