ETV Bharat / snippets

వికీపీడియాకు కేంద్రం షాక్- 'పబ్లిషర్‌గా ఎందుకు ట్రీట్ చేయకూడదు?'

Wikipedia
Wikipedia (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Centre Notices To Wikipedia : ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే ఎన్‌సైక్లోపీడియా వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వికీపీడియాలో లభించే సమాచారంలో పక్షపాత ధోరణి, తప్పుడు సమాచారం ఉంటుందన్న ఆరోపణలపై నోటీసులు పంపింది. వికీపీడియాలో వివిధ విషయాలకు సంబంధించిన సమాచారంలో పక్షపాత ధోరణి ఉంటుందని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది.

ప్రజలకు సమాచారం అందించే విషయంలో తమను ప్రచురణకర్తలుగా కాకుండా మధ్యవర్తులుగానే పరిగణించాలని వికీపీడియా యాజమాన్యం వినిపిస్తున్న వాదనలను కేంద్రం తప్పుబట్టింది. సమాచార వారధిగా కాకుండా, పబ్లిషర్‌గా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కొంతమంది వ్యక్తులతో కూడిన బృందానికి మాత్రమే ఈ పేజీల్లోని సమాచారంపై నియంత్రణ ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొంది. చిన్న చిన్న సంస్థలకు కూడా ఎడిటోరియల్‌ నియంత్రణ ఉంటుందని, వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.