ETV Bharat / technology

రాయల్ ఎన్​ఫీల్డ్ ఫస్ట్ ఈవీ లుక్​ రివీల్- ఇది కదా అసలుసిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే..!

రాయల్ ఎన్​ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్- ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా..!

Flying Flea C6
Flying Flea C6 (Royal Enfield)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 5, 2024, 4:18 PM IST

Royal Enfield Flying Flea C6: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్​కు ఆదరణ పెరుగుతోంది. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో పలు కంపెనీలు సరికొత్త ఫీచర్లతో వీటిని రిలీజ్ చేయడంపై ఫోకస్ చేశాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలు ఈ విభాగంలో బైక్స్​ను లాంచ్ చేశాయి. తాజాగా చెన్నైకు చెందిన ప్రముఖ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్​ కూడా ఈవీ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది.

దేశంలో 250-750సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో నంబర్​ వన్​గా ఉన్న రాయల్ ఎన్​ఫీల్డ్​ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇది రెట్రో- ఫ్యూచరిస్టిక్‌ మోటార్‌ సైకిల్‌. ఇకపై మార్కెట్లోకి తీసుకొచ్చే అన్ని ఎలక్ట్రిక్ బైక్‌లను 'ఫ్లయింగ్‌ ఫ్లీ' పేరిట ఆవిష్కరించనున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఫీచర్లు:

  • ఈ మోటార్​ సైకిల్ రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ముందువైపు గిర్డర్‌ ఫోర్క్‌లతో రానుంది.
  • ఇది ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌తో రానున్నట్లు తెలుస్తోంది.
  • రెండు సీట్ల వెర్షన్స్​ కూడా ఈ ఎలక్ట్రిక్ మోటార్​ సైకిల్​లో ఉండనున్నట్లు అంచనా.
  • ఈ బైక్ టీఎఫ్​టీ డిస్​ప్లేతో రానుంది.
  • ఇది సింగిల్‌ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
  • ఈ బైక్ లుక్​ను రివీల్‌ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. దీని ధర, ఫీచర్లపై పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
  • త్వరలోనే ఆ వివరాలన్నీ ప్రకటించే అవకాశం ఉంది.
  • కంపెనీ 2026లో మార్కెట్లోకి ఈ బైక్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ ఈవీ కిర్రాక్ టీజర్: రాయల్ ఎన్​ఫీల్డ్ ఇటీవలే తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ టీజర్​ను రిలీజ్​ చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో కంపెనీ దీని మొదటి కిర్రాక్​ టీజర్​ను అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ టీజర్​లో పారాచూట్​ సాయంతో ఓ బైక్​ స్పేస్​ నుంచి కిందకు వస్తున్నట్లు చూపించారు. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

డ్రైవర్ల కొరతను తీర్చేందుకు జపాన్ మాస్టర్ ప్లాన్- ఆటోమేటెడ్​ కార్గో ట్రాన్స్​పోర్ట్​పై ఫోకస్

ఎక్స్ యూజర్స్​కు క్రేజీ అప్​డేట్​- మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి పోస్ట్​లను ఇకపై చూడొచ్చు- అదెలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.