Delhi IAS Coaching Centre Tragedy : దిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్ర హోంశాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ, ప్రమాదానికి దారితీసిన కారణాలు, నివారణ చర్యలతోపాటు విధానపరమైన మార్పులను సిఫారసు చేస్తుందని హోంశాఖ ఉన్నతాధికారి తెలిపారు. గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి, దిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, దిల్లీ పోలీస్ స్పెషల్ సీపీ, ఫైర్ అడ్వైజర్లు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 30రోజుల్లో నివేదిక అందజేయనుంది. మరోవైపు, ఘటనాస్థలిని దిల్లీ ఎల్జీ వీకే సక్సేనా సందర్శించి, నిరసనలు చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అయినా, విద్యార్థులు నిరసనలు కంటిన్యూ చేశారు. సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన చేసి, చనిపోయిన సివిల్స్ ఆశావహులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్ర హోంశాఖ విచారణ కమిటీ- బాధితులకు రూ.10 లక్షల పరిహారం
Published : Jul 30, 2024, 6:37 AM IST