ETV Bharat / snippets

'దేశంలోని అవినీతికి శరద్​ పవార్ అతిపెద్ద నాయకుడు​'- ఇండియా కూటమిపై విరుచుకుపడ్డ అమిత్‌ షా!

Amit Shah Fire On Sharad Pawar
Amit Shah Fire On Sharad Pawar (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 7:30 PM IST

Amit Shah Fire On Sharad Pawar : కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా ఇండియా కూటమిపై ఎదురుదాడి పెంచారు. ఎన్​సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్‌ దేశంలోని అవినీతికి అతిపెద్ద నాయకుడని ఆరోపించారు. అవినీతిని సంస్థాగతం చేశారని అమిత్‌షా విమర్శించారు. పుణెలో జరిగిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో పాల్గొన్న అమిత్‌ షా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైనా, రాహుల్‌గాంధీలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. ఈ ఏడాది జరిగే మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాహుల్‌ అహంకారం అనుగుతుందన్నారు. శివసేన యూబీటీవర్గం అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను ఔరంగజేబు అభిమాన సంఘం నాయకుడిగా అభివర్ణించారు. 1993లో జరిగిన ముంబయి వరుస బాంబుపేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్‌ మీనన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆందోళన చేశారని అమిత్‌ షా ఆరోపించారు. బీజేపీ సారథ్యంలోని మహాయుతి 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మెజార్టీ స్థానాలు సాధిస్తుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.