ETV Bharat / snippets

మధ్యప్రదేశ్‌లో కూలిన 400 ఏళ్ల నాటి గోడ- ఏడుగురు మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 3:26 PM IST

Wall Collapsed In Madhya Pradesh
Wall Collapsed In Madhya Pradesh (ETV Bharat)

400 Year Old Wall Collapsed : మధ్యప్రదేశ్‌లోని దతియా పట్టణంలో 400 వందల ఏళ్లనాటి గోడకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ కూలింది. ఖల్కాపురా ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్​డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో శిథిలాల కింద తొమ్మిది మంది చిక్కుకున్నారు. వారిలో ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. కలెక్టర్ సందీప్ మాకిన్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.