బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్లోకి జహీరాబాద్ ఎమ్మెల్యే - క్లారిటీ ఇచ్చిన మాణిక్ రావు - MLA Manik Rao news
🎬 Watch Now: Feature Video
Published : Mar 3, 2024, 9:29 PM IST
Zaheerabad MLA Manik Rao Clarity on Party Change : బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మాణిక్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల పలు ఛానళ్లలో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆయన అన్నారు. తనపై నమ్మకంతో 2014, 2019, 2023లో అవకాశం కల్పించి, రెండుసార్లు ఎమ్మెల్యేను చేసిన సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతానని చెప్పారు.
MLA Manik Rao : 2014లో ఓడిపోయినా పార్టీ టికెట్ ఇచ్చిందని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని తెలిపారు. జహీరాబాద్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పార్టీ మారి వారి నమ్మకాన్ని పోగొట్టుకోనని తెలిపారు. ఇటీవల ఎంపీ బీబీ పాటిల్ పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని, తాను మాత్రం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని తేల్చి చెప్పారు.