మున్సిపల్ ఆఫీస్ ఎదుట పడుకొని వైఎస్సార్సీపీ రెబల్ కౌన్సిలర్ నిరసన - వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 4:53 PM IST
Councilor Protest at Municipality Office: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 20వ వార్డు వైఎస్సార్సీపీ రెబల్ కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి పడుకుని నిరసన తెలిపారు. స్థానిక మున్సిపాలిటీలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ఆయన అన్నారు. నాలుగున్నర కోట్ల రూపాయల సొంత నగదుతో ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి బస్టాండ్ నిర్మించారని ప్రచారం చేసుకుంటున్నారని, అయితే మున్సిపాలిటీ నిధులతో బస్టాండ్ నిర్మించారని తమకు అనుమానాలు ఉన్నాయని కౌన్సిలర్ ఆరోపించారు. దీనిపై 72 రోజులుగా అధికారులను అడుగుతున్నా సమాచారం ఇవ్వట్లేదని వాపోయారు. అవినీతి లేకుండా పనులు జరిగి ఉంటే సమాచారం ఇవ్వటానికి ఏమైందని అధికారులను ప్రశ్నించారు.
"ఆత్మకూరు మున్సిపాలిటీలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయి. నాలుగున్నర కోట్ల రూపాయల సొంత నగదుతో ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి బస్టాండ్ నిర్మించారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మున్సిపాలిటీ నిధులతోనే బస్టాండ్ నిర్మించారని నా అనుమానం. దీనిపై 72 రోజులుగా అధికారులను అడుగుతున్నా సమాచారం ఇవ్వట్లేదు. అవినీతి లేకుండా పనులు జరిగి ఉంటే సమాచారం ఇవ్వడానికి అధికారులకు ఇబ్బందేంటి?" - సురా భాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రెబల్ కౌన్సిలర్