రాజకీయాలను కుటుంబానికి అపాదించడం సరికాదు-షర్మిలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి - YSRCP MP Vijayasai Reddy comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 10:38 PM IST

YSRCP MP Vijayasai Reddy Key comments: రాజకీయాలను కుటుంబానికి అపాదించడం మంచి సంప్రదాయం కాదని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ భావితరాలు కూడా అధికారం నమ్మరని తెలిపారు. అలాంటి పార్టీ కోసం ఎవ్వరు ప్రయత్నించినా ఫలితం ఉండదని షర్మిలను ఉద్దేశిస్తు పేర్కొన్నారు.  రాజకీయ లబ్ది కోసం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఏపీని విభజించారన్నారని, అలా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఎవరు పైకి లేపాలని ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీ పైకిలేచే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. 

 గుంటూరు జిల్లా మంగళగిరి నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు రూ.8 కోట్లతో నిర్మించిన ఈత కొలను, స్కేటింగ్ గ్రౌండ్, వ్యాయామశాలను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మంగళగిరిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిని గెలిపించాలని కోరారు. ఈసారి మంగళగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో నివసిస్తూ తెలుగుదేశం తరఫున పోటిచేసే వ్యక్తి కావాలో, మీతో ఉండే వ్యక్తి కావాలో  తేల్చుకోవాలని తెలిపారు.  రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.