షర్మిల సరైన పత్రాలు లేకుండా దొంగ సంతకాలతో షేర్లు మార్చారు: విజయసాయిరెడ్డి - VIJAYASAI REDDY FIRES ON SHARMILA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 5:14 PM IST

YSRCP MP Vijayasai Reddy Fires on YS Sharmila: జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలన్న చంద్రబాబు కుట్రలో షర్మిల పావులా మారారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్​ని (YS Jagan Mohan Reddy) తిట్టడానికే వైఎస్ షర్మిల అనేక సార్లు దిల్లీ వేదికగా ప్రెస్​మీట్లు పెట్టారని మండిపడ్డారు. కేవలం ఆస్తి తగాదాలైతే సర్దిచెప్పవచ్చన్న విజయసాయి రెడ్డి, జగన్​ని అధికారానికి దూరం చేయటమే లక్ష్యంగా చంద్రబాబుతో షర్మిల లాలూచీపడ్డారని మండిపడ్డారు. 

తల్లికి, చెల్లికి అన్యాయం చేశారంటూ ప్రచారం చేస్తున్నారన్న విజయసాయి రెడ్డి, వైఎస్సార్ చావుకి కారణమైన వారితో చేతులు కలపటం దుర్మార్గం కాదా అంటూ షర్మిలను ప్రశ్నించారు. షర్మిల చంద్రబాబుతో చేతులు కలపకపోతే, జగన్​కి షర్మిల రాసిన లేఖ చంద్రబాబు చేతికి ఎలా వచ్చిందని విమర్శించారు. షర్మిల సరస్వతి సంస్థకు సంబంధించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, సరైన పత్రాలు లేకుండా దొంగ సంతకాలతో షేర్లు మార్చారని మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.