విశాఖ తూర్పులో వైసీపీ ఎంపీ తాయిలాలు - ఓటున్న మహిళలకు చీర - YSRCP MP Sarees Distribution
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 1, 2024, 9:10 PM IST
YSRCP MP MVV Satyanarayana Distributing Sarees: ఎన్నికలు సమీపిస్తున్న ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను వైసీపీ నేతలు ముందస్తుగానే మొదలుపెట్టేశారు. పార్లమెంటు సభ్యుడు, విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవీవీ సత్యనారాయణ మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బహిరంగంగానే తన అనుచరులతో ఓటర్లకు చీరలు పంపిణీ చేయిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎంపీ అనుచరులు ఇంటింటికి తిరిగి ఓటర్లు లిస్టులో పేరు వెరిఫికేషన్ చేసి మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు.
తూర్పు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎంపీ ఎంవీవి సత్యనారాయణ అనుచరులు అన్ని వార్డుల్లోనూ మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. ఓటర్ల లిస్టులో వారి పేరును వెరిఫికేషన్ చేయడంతో పాటు వారి ఫోన్ నెంబర్ను కూడా నమోదు చేసుకుని చీరలు ఇస్తున్నారు. అయితే చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఎక్కడ కూడా కనబడకుండా కార్యక్రమాన్ని తన అనుచరులతో చక్కబెట్టిస్తున్నారు. ఎంపీ అనుచరులు గ్రూపులుగా విడిపోయి వార్డుల్లో చీరలు పంపిణీ చేస్తున్నప్పటికీ ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదు.