ఆగని వైఎస్సార్సీపీ అరాచకాలు - టీడీపీకి ఓటేశారని రైతుపై కక్షసాధింపు చర్యలు - Transformer removal in farmer field - TRANSFORMER REMOVAL IN FARMER FIELD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 7:37 PM IST
Transformer Removal in Farmer Field: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. ఓటు వేయకపోతే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలు, తాజాగా రైతన్నపై సైతం కక్షగట్టారు. ఓటు వేయలేదన్న కారణంతో, రైతు పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ తీయించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.
ఎన్నికల్లో ఓటేయలేదని, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెనికి ఓ వ్యక్తి జీవనాధారాన్ని నాశనం చేశారు. గ్రామానికి చెందిన బుక్యా నరసింహ నాయక్ బోరు నీటితో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నరసింహ నాయక్ టీడీపీకి ఓటు వేశారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ తీయించేశారు. దీంతో సాగు ఎలా చేయాలో తెలియడం లేదని, బాధితులు వాపోతున్నారు. టీడీపీకి ఓటు వేసినందుకే తనపై కక్షగట్టారని ఆరోపించాడు. ఓటు అడగడానికి వచ్చిన రోజు తాను టీడీపీకి ఓటు వేస్తానని చెప్పానని, అందుకే కక్షగట్టి ట్రాన్స్‌ఫార్మర్ తొలగించారని రైతు వాపోయాడు. విద్యుత్ లేకపోతే తాను వ్యవసాయం ఎలా చేయాలో వైఎస్సార్సీపీ నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు ఆ భూమే జీవనాధారమని పేర్కొన్నారు. ఇదే అంశంపై కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశానని రైతు తెలిపారు. తనకు న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుటానని ప్రభుత్వాధికారులను హెచ్చరించాడు.