'చచ్చినా వదిలే ప్రసక్తే లేదు' - స్థలం కోసం మహిళకు వైసీపీ సర్పంచ్ బెదిరింపులు - వైసీపీ సర్పంచ్ భూ కబ్జా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 12:19 PM IST
YSRCP Leaders Land Kabja: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. గ్రామంలోని జగనన్న కాలనీకి ఆనుకుని బేబి సరోజిని అనే మహిళకు 13 సెంట్ల స్థలం ఉంది. దాన్ని వైసీపీ సర్పంచ్ మహేష్ తన అనుచరులతో కలిసి లాక్కునేందుకు యత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనికి తహసీల్దార్ (MRO), వీఆర్వో (VRO) సహకరిస్తున్నారని వాపోయారు. ఉన్న ఒక్క ఆధారాన్ని వైసీపీ నాయకులు లాగేసుకుంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితులకు స్థానిక తెలుగుదేశం నాయకులు అండగా నిలిచారు.
"వైసీపీ సర్పంచ్ మహేష్ తన అనుచరులతో వచ్చి మా 13 సెంట్ల స్థలాన్ని లాక్కునేందుకు యత్నిస్తున్నారు. మేము చనిపోయినా సరే ఈ స్థలాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. దీనికి తహసీల్దార్, వీఆర్వో సైతం సహకరిస్తున్నారు. ఉన్న ఒక్క ఆధారాన్ని వైసీపీ నాయకులు లాగేసుకుంటే మా పరిస్థితి ఏంటి ? దీనిపై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం." - బాధిత కుటుంబం