ఓటు ఎవరికి వేయాలో చెప్పండి - వాలంటీర్లకు వైసీపీ నేతల ప్రలోభాలు - ఎన్నికల విధుల్లో వాలంటీర్లు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 12:49 PM IST

YSRCP Leaders on Volunteers in Election Duties: ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనటానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ (Election Commission)​ స్పష్టంగా చెప్తుంటే మరోపక్క వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders) మాత్రం వారితోనే ఎన్నికలు జరపాలని సభలలో చెప్తున్నారు. ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న వాలంటీర్ల (Volunteers)ను పార్టీ కోసం పని చేయమంటున్నారు. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి (CM Jagan)ని చేసే బాధ్యత వాలంటీర్లపైనే ఉందని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్‌ బలసాని కిరణ్ కుమార్ (Prattipadu YSRCP Incharge Balasani Kiran Kumar) అన్నారు. 

గుంటూరు జిల్లా కాకుమానులో 'వాలంటీర్లకు వందనం' కార్యక్రమం (Volunteerlaku Vandanam Program) లో పాల్గొని మాట్లాడారు. వాలంటీర్ల పరిధిలో ఉన్న 50 ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలో చెప్పాలన్నారు. మధ్యస్థ ఓటర్లకు జగన్ పాలన గురించి చెప్పి ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని స్పష్టం చేశారు. వాలంటీర్లకు మంచి రోజులున్నాయని, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని వారికి తాయిలాలు ఎర వేశారు. వాలంటీర్లంతా జగనన్న వారియర్స్‌గా అభివర్ణించిన ఆయన వచ్చే ఎన్నికల్లో జగన్​కి 175 సీట్లను గిఫ్ట్​గా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ సొమ్ముతో జీతం తీసుకుంటున్న వాలంటీర్లను పార్టీ కోసం పని చేయమని చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.