CM CHANDRABABU STOPS CAR FOR FAN: ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నిత్యం బిజీబిజీగా ఉంటారు. ఎన్నో మీటింగ్‌లు, ప్రతి నిమిషం ముఖ్యమే. ఎవరైనా సరే కలవాలి అంటే అపాయింట్మెంట్ ఉండాల్సిందే. ఇక సామాన్య కార్తకర్తకు ముఖ్యమంత్రిని కలవడం అయితే మామూలుగా సాధ్యమయ్యే పని కాదు. కానీ వీటికి సీఎం చంద్రబాబు అతీతమని తాజా సంఘటనతో నిరూపితమైంది. ఒక సాధారణ కార్యకర్త కోసం ఏకంగా కాన్వాయ్‌ని ఆపించారు. ఆ కార్యకర్త ఎవరు, ఎప్పుడు కలిశారు అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం తిరుపతిలో ఐటీసీఎక్స్-2025 సదస్సు జరిగింది. అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే తిరుగు ప్రయాణంలో మంగళం సమీపంలోని దారిలో తెల్లని జుట్టుతో ఓ వ్యక్తి నిల్చున్నారు. కారులో ఉన్న సీఎం చంద్రబాబు చూపు ఒక్కసారిగా ఆ పెద్దాయన వైపు పడింది. అంతే ఆయనను చూసిన వెంటనే ఒక్కసారిగా తన వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాను ప్రయాణిస్తున్న కారు అద్దం కిందకు దించి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచారు సీఎం చంద్రబాబు.
‘ఏం బాషా బాగున్నావా, నీ ఆరోగ్యం బాగుందా?’ అంటూ కుశల ప్రశ్నలు వేయడం మొదలు పెట్టారు. సాక్షాత్తూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి దారిలో కనిపించిన వ్యక్తిని పేరు పెట్టి మరీ పలకరించడంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.
ఈ పరిణామంతో మంగళం సమీపంలోని శేషాచలనగర్‌లో నివాసం ఉంటున్న టీడీపీ సీనియర్ కార్యకర్త ఎస్‌ఏ అజీజ్‌బాషా చలించిపోయారు. 40 ఏళ్లుగా తాను చంద్రబాబుకు తెలుసు అని, ఆయన్ను చూసేందుకు వచ్చానని తెలిపారు. అయితే భద్రతా కారణాలతో రోడ్డు పక్కనే నిలబడిపోయానని చెప్పారు. అయినా తనను సీఎం చంద్రబాబు గుర్తు పట్టి మరీ పలకరించారని, ఈ జన్మకి ఇది చాలంటూ అజీజ్ బాషా ఉద్వేగానికి లోనయ్యారు.
నందిని కోసం ఆగిన చంద్రన్న- జ్వరాన్నీ లెక్కచేయని అభిమానం ఆమెది - Madanapalle Woman
రోడ్డుపై కాన్వాయ్ ఆపిన సీఎం- ఆప్యాయంగా పలకరించి, వినతులు స్వీకరించిన చంద్రబాబు - CM Chandrababu