BTech Ravi Sensational Comments On Pulivendula By Election : పులివెందుల నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం ఖాయమని టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంఛార్జ్ బీటెక్ రవి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్ ఎమ్మెల్యేగా అనర్హుడని చెప్పారు. జగన్‌ను పులివెందులు ప్రజలు మళ్లీ గెలిపించరని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమస్యలతో పాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడని విమర్శించారు. తన స్నేహితుడు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో కలిసి ఏ కార్యకర్త ఇబ్బంది పడకుండా చూసుకుంటామని చెప్పారు. ఇద్దరూ కలిసి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు.
జగన్ తప్పిదాల వల్ల పులివెందుల నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. వాటన్నింటినీ పరిష్కరిస్తామని బీటెట్ రవి స్పష్టం చేశారు. అంతకుముందు వేంపల్లి పట్టణంలోని ఉర్దూ గురుకుల పాఠశాలలో జాతీయ అంధత్వ నివారణలో భాగంగా విద్యార్థులకు కంటి అద్దాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పులివెందులకు ఉపఎన్నిక కచ్చితంగా వస్తుంది: బీటెక్ రవి
వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం మాదన్నగారి పల్లెలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే తాగు, సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. వామికొండ నుంచి దక్షిణ కాలువకు పనులు పూర్తిచేసి రైతులకు నీరందించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. తామంతా ఒకటే పార్టీ, అది రైతు పార్టీ అని ఆదినారాయణ రెడ్డి అన్నారు.
పార్టీలకతీతంగా రైతులకు నీరందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని, ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయో జగన్‌కే తెలియదని ఎద్దేవా చేశారు. త్వరలో జగన్ జైలుకెళ్లడం ఖాయమని ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా తాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు.
పులివెందులలో వైసీపీ శ్రైణులు వికృత చేష్టలకు దిగొద్దు - బీటెక్ రవి
'నేనే వస్తా' - పులివెందుల బై ఎలక్షన్‌పై రఘురామ ఇంట్రస్ట్ కామెంట్స్ - వీడియో వైరల్