ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నేత స్థల వివాదం - కర్రలు, రాళ్లతో ఓ కుటుంబంపై దాడి - YSRCP Leader attack in kadimetla - YSRCP LEADER ATTACK IN KADIMETLA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-04-2024/640-480-21142666-thumbnail-16x9-ysrcp--leader-attack-in-kadimetla-on-land-dispute.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 11:47 AM IST
YSRCP Leader Attack In Kadimetla On Land Dispute: వైఎస్సార్సీపీ నేతల కన్ను పడిందా? కబ్జా కావలసిందే లేకపోతే రక్తపాతమే. అధికార పార్టీ నేతలు దోచుకోవడానికి పేద, ధనిక అని తేడా ఉండదు. దోచుకోవాలని అనుకుంటే అడ్డువచ్చినవారు పిల్లలు, మహిళలు అని చూడకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో స్థలం విషయంలో ఓ కుటుంబంపై వైఎస్సార్సీపీ నేత దాడికి తెగబడ్డాడు. కర్రలు, ఇతర ఆయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలో కడిమెట్లలో భీషన్న అనే వ్యక్తికి 5 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలం తనకు విక్రయించాలని వైఎస్సార్సీపీ ఎంపీపీ కేశన్న పట్టుబడుతున్నాడని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.ఇటీవల భీషన్న స్థలం విక్రయించేది లేదని వైఎస్సార్సీపీ నేతకు తేల్చి చెప్పటంతో ఆగ్రహానికి గురై భీషన్నపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భీషన్న కుటుంబ సభ్యులను కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.